Ambati Rayudu: గుంటూరు ఎంపీగా పోటీ?

Guntur: క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు (ambati rayudu) గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం (guntur) నుంచి రానున్న ఎన్నిక‌ల్లో ఎంపీగా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాయుడుకి అధికార YCP టికెట్ ఇస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. గ‌తంలోనూ రాయుడు YCP ప్రభుత్వాన్ని, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (ap cm jagan) పొగుడుతూ ప‌లు ట్వీట్లు కూడా చేసాడు. అప్పుడే రాయుడు పొలిటిక‌ల్ ఎంట్రీ క‌న్ఫామ్ అయిపోయింది. త్వ‌ర‌లోనే రాయుడు గుంటూరు ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ట్లు YCP ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.