Ambati Rambabu: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వెబ్ సిరీస్..!

AP: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు (ambati rambabu) బ్రో (bro) సినిమా కలెక్ష‌న్ల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan) నటించిన బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అని ఈ సినిమా నిన్నటివరకు 55.26 కోట్ల షేర్ వసూలు చేసింద‌ని అన్నారు. నిన్న కేవ‌లం రూ. 2.3 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింద‌ని తెలిపారు.

“” ప‌వ‌న్ న‌టించిన బ్రో సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుతంగా ఉంద‌ని సూప‌ర్ హిట్ అని ప్ర‌చారం చేసుకుంటున్నారు. దాంతో పాటు స‌క్సెస్ మీటింగ్ కూడా పెడుతున్నారు. దీని నిజ స్వ‌రూపం ఏంటంటే.. ఇదొక డిజాస్ట‌ర్ సినిమా. ఆధారాల‌తో స‌హా చెప్పాల‌నుకుంటున్నాను. సినిమా మొత్తం వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ద‌గ్గ‌ర‌గా ఒక‌ రూ.60 కోట్లు ఉంటుంది. వాళ్లు శ్యాం బాబు, రాంబాబు అని కాంట్రొవ‌ర్సీ క్రియేట్ చేసి హైప్ తీసుకొస్తే ఇంకో కోటి రూపాయ‌లు పెర‌గొచ్చు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అట్ట‌ర్ ఫ్లాప్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మేం వెబ్ సిరీస్ తీయాల‌నుకుంటున్నాం. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం అంటే మూడు పెళ్లిళ్ల గురించి వెబ్ సిరీస్ తీస్తాం. దానికి టైటిల్స్ కూడా అనుకున్నాం. మీరే సెలెక్ట్ చేయండి ఒక మంచి టైటిల్‌ని “” అని అన్నారు.

బ్రో (bro) సినిమాలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ (pruthvi raj) శ్యాం బాబు అనే క్యారెక్ట‌ర్‌లో యాక్ట్ చేసారు. ఈ క్యారెక్ట‌ర్ అంబ‌టి రాంబాబుని (ambati rambabu) ఉద్దేశించి సినిమాలో పెట్టార‌ని టాక్ వ‌చ్చింది. దీనిపై రాంబాబు స్పందిస్తూ.. బ్రో సినిమాను తాను చూడ‌లేద‌ని, ప‌వ‌న్ త‌న‌ను శత్రువులా చూస్తున్నార‌ని అన్నారు. దీనిపై పృథ్వీ కూడా స్పందించారు. అంబ‌టి రాంబాబు ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని, ఆయ‌న్ను ఇమిటేట్ చేయ‌డానికి ఆయ‌నేమీ ఆస్కార్ న‌టుడు కాద‌ని సెటైర్ వేసారు.