Ambati Rambabu: బాలకృష్ణ కాల్పుల కేసు కూడా తీస్తారా?
Ambati Rambabu: తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కావాలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారి పాత కేసులన్నీ తోడుతోందని ఆరోపించారు అంబటి రాంబాబు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు విషయంలో కూడా కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లు ప్ ప్రవర్తిస్తున్నారని.. అసలు ఆ అమ్మాయికి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. త్వరలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు బయటికి వస్తాయని అన్నారు.
“” ఈ కాదంబరి జత్వానీ అనే యువతి గురించి నేను చాలా విన్నాను. అవన్నీ నా నోటితో నేను చెప్పలేను. నిజాలు రేపో మాపో అన్నీ బయటికి వస్తాయి. సజ్జల నాకు జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసు. జగన్‌కు సలహాదారుగా ఉండటమే అతను చేసిన తప్పా? అందుకే కదా మా మీద లేనిపోని కేసులు కడుతున్నారు. ఏదో ఎన్నికల్లో గెలిచేసాం అన్న ఉత్సాహంతో ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈ జత్వానీ అనే యువతి కేసు తెలుగు దేశం పార్టీకే బూమరాంగ్‌గా మారుతుంది. అన్నీ కేసులు బయటికి తీస్తున్నప్పుడు మరి గతంలో బాలకృష్ణ ఓ నిర్మాతపై కాల్పులు జరిపిన కేసును కూడా బయటికి తీయాలి కదా?
మా రాజ్యసభ ఎంపీలను లాక్కుని ఏం చేస్తారు? ఉత్తరాంధ్రలో కూడా ఇలాంటి వెధవ పనే చేయాలని అనుకున్నారు. అది చేత కాకపోవడంతో విశాఖ ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ మారే వారికి ఉన్న పరువు పోవడం తప్ప వారికి ఒరిగేదేమీ ఉండదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే కానీ గెలవలేదు మీరు. మా జగన్ ఒంటరిగా వచ్చినా 40 శాతం దక్కించుకున్నాడు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో ఆలోచించడంపై దృష్టి పెడితే మంచిది “” అని మండిపడ్డారు.