Ambati Rambabu: తండ్రిది డ్రామా.. కొడుకుది ఆవేదన
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌తో 154 మంది గుండెపోటుతో చనిపోయారు అని మామూలుగా చనిపోయినవారిని తమ ఖాతాలో వేసుకుని TDP పొలిటికల్ డ్రామా చేస్తోందని ఆరోపించారు YSRCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu)
నిన్న TDP నేతలతో కలిసి నారా లోకేష్ (nara lokesh) విస్తృత సమావేశం ఏర్పాటుచేసారని.. ఆ సమయంలో పులి జైల్లో ఉంటే పులి బిడ్డ మీ ముందు ఉంది అంటూ వర్ల రామయ్య (varla ramaiah) మైక్ లోకేష్‌కి ఇస్తే ఆయన కంటతడి పెట్టుకున్నారని అన్నారు. ఓసారి అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి చంద్రబాబు కూడా ఇలాగే కన్నీరుపెట్టుకున్నారని.. కాకపోతే ఇక్కడ చంద్రబాబుది డ్రామా.. లోకేష్‌ది ఆవేదన అని తెలిపారు.
లోకేష్ ఆవేదన చెందడానికి కారణం.. తను ఒక సుద్ద పప్పు అయినా ఎక్కడా గెలవకపోయినా కేబినెట్లో చేర్చుకున్న తండ్రి జైలులో ఉండటమేనని వెటకారంగా మాట్లాడారు. లోకేష్ ఏడవటానికి తప్ప దేనికీ పనికిరాడని.. ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకుని తెలుగు దేశం పార్టీలో ఉన్న నేతలంతా మరో వ్యక్తిని తమ నాయకుడిగా పెట్టుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు. మాట్లాడితే జగన్‌ని పట్టుకుని సైకో జగన్ అంటుంటాడని… నిజానికి సైకోలు లోకేష్, చంద్రబాబులేనని మండిపడ్డారు. (ambati rambabu)