Ambati Rambabu: జోగి ర‌మేష్‌, దేవినేని అవినాష్‌లు ముద్దాయిలే!

Ambati Rambabu says jagan goes to any extent to save his leaders

Ambati Rambabu: తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి చేసిన కేసులో భాగంగా నిందితులుగా ఉన్న జోగి ర‌మేష్‌, దేవినేని అవినాష్‌ల‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాక‌పోతే వారి పాస్‌పోర్టుల‌ను అధికారుల‌కు అప్ప‌గించాల‌ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందే అని హెచ్చ‌రించింది. హాజ‌రు కాలేని ప‌క్షంలో కోర్టు నుంచి ఎలాంటి ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేమ‌ని వెల్ల‌డించింది.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబ‌టి రాంబాబు జోగి ర‌మేష్‌, దేవినేని అవినాష్‌లు ముద్దాయిలే అని ఒప్పేసుకున్నారు. సుప్రీంకోర్టు వారికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన నేప‌థ్యంలో ఆయ‌న ట్వీట్ చేసారు. “” TDP ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు! ఎంత దూరం అయినా వెళ్లి కార్యకర్తలను రక్షించుకుంటాడు మన జగనన్న ! “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. సొంత పార్టీ నేత‌ల‌నే ముద్దాయిలు అని రాంబాబు ఒప్పేసుకున్న‌ట్లే అని ట్రోల్స్ పేలుతున్నాయి.

Ambati rambabu