Ambati Rambabu: అరెస్ట్ అయిన సీఎంలు మళ్లీ సీఎం కాలేదు
తెలుగు దేశం పార్టీని కాపాడటం దేవుడి తరం కూడా కాదని అన్నారు YSRCP నేత అంబటి రాంబాబు (ambati rambabu). ఇప్పటివరకు అరెస్ట్ అయిన మాజీ సీఎంలు మళ్లీ సీఎం అయిన దాఖలాలు లేవని అన్నారు.
“” చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో 100 మంది చనిపోయారని అంటున్నారు. సాధారణంగా గుండెపోటు వచ్చి చనిపోయినవారికి చంద్రబాబు ఖాతాలో వేసేసారు. అదే నిజం అయితే ఇప్పటివరకు ఎందుకు ఆ కుటుంబాలను పరామర్శించలేదు. భార్య, తల్లిని వదిలేసి ఎందుకు లోకేష్ ఢిల్లీలో కూర్చున్నాడు? ఏ వ్యవస్థను మేనేజ్ చేసేందుకు అక్కడ ఉన్నాడు? వారి లాగా మా జగన్‌కు వ్యవస్థలను మేనేజ్ చేయడం రాదు. అక్రమార్కులను జైలులో పెడితే సానుభూతి రాదు. చంద్రబాబు తప్పు చేసాడని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పటివరకు చంద్రబాబుకి బెయిల్ ఎందుకు రాలేదంటే.. కోర్టు దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయనే అర్థం. ఓపక్క పవన్ కళ్యాణ్ TDPకి సపోర్ట్ అంటాడు. మళ్లీ TDP పని అయిపోయిందని అంటాడు. ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలీదు “” అని తెలిపారు.