Ambati Rambabu: చంద్ర‌బాబు మోస‌గాడు.. జ‌గ‌న్ మొన‌గాడు

Ambati Rambabu says cbn is mosagadu and jagan is monagadu

Ambati Rambabu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మోస‌గాడ‌ని.. త‌మ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి మొన‌గాడ‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అంబ‌టి రాంబాబు. విశాఖ‌ప‌ట్నంలోని అచ్యుతాపురంలో నిన్న రియాక్ట‌ర్ పేరి దాదాపు 19 మంది కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వమే కార‌ణం అని చంద్ర‌బాబు అన్నారు.

దాంతో అంబ‌టి రాంబాబు చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలో ఏం జ‌రిగినా జ‌గ‌న్‌పైకి నెట్టేయ‌డం స‌బ‌బు కాద‌ని అన్నారు. రాజ‌కీయంగా త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో త‌ప్పు లేదు కానీ తుమ్మినా ద‌గ్గినా కూడా త‌ప్పు జ‌గ‌న్‌దే అంటే ఒప్పుకోమ‌ని అన్నారు. చంద్ర‌బాబు ఇస్తాన‌న్న హామీల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని.. అందుకే ఆంబులెన్స్ డ్రైవ‌ర్ కూడా కోటి ప‌రిహారం ఇస్తేనే క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తాన‌ని అన్న‌ట్లు త‌న‌కు కార్య‌క‌ర్త‌ల ద్వారా తెలిసింద‌ని అన్నారు. చంద్ర‌బాబుకు క్రైసిస్ మేనేజ్మెంట తెలీద‌ని.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు మోస‌గాడైతే జ‌గ‌న్ మొన‌గాడ‌ని అన్నారు.