Ambati Rambabu: చంద్ర‌బాబు ముఖం చూస్తుంటేనే జ‌నాల‌కు రోత పుడుతోంది

ambati rambabu says ap people are disgusted to look at chandrababu naidu

Ambati Rambabu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రోత‌పుడుతోంద‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబ‌టి రాంబాబు. ఎన్నిక‌ల‌కు ముందు ప‌థ‌కాలు ఇచ్చేట‌ప్పుడేమో సంప‌ద సృష్టిస్తాం అని చెప్పి.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక ప‌థ‌కాలు ఇవ్వ‌కుండా ఖ‌జానాలో డ‌బ్బులు లేవ‌ని మాట మార్చాడ‌ని అన్నారు. దాంతో చంద్ర‌బాబు నాయుడికి ఎందుకు ఓటేసాం రా బాబూ అని రాష్ట్ర ప్ర‌జ‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ని అన్నారు.

విదేశాల్లో భూత‌గాదాలు 3 శాతం మాత్ర‌మే ఉంటాయ‌ని.. కానీ భార‌త‌దేశంలో 70 శాతం ఈ కేసులే చూస్తుంటామ‌ని తెలిపారు. ఎవ‌రి భూమి వారికే ద‌క్కాలి అన్న ఉద్దేశంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రీ స‌ర్వేయింగ్ చేయించాల‌నుకున్నార‌ని.. దానిని కూడా త‌ప్పుబ‌ట్టిన చంద్ర‌బాబు రీ స‌ర్వేలు అవ‌స‌ర‌మైన వారికే చేయిస్తామ‌ని ఎందుకు మాట‌మారుస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.