Ambati Rambabu: ఎర్ర బుక్కు వెర్రి స‌న్నాసి

Ambati Rambabu: నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర పూర్త‌యిన సంద‌ర్భంగా ఈరోజు పోలిప‌ల్లిలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేయ‌నున్నారు. ఈ స‌భ‌కు ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుతో (chandrababunaidu) పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) కూడా రానున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి అంబ‌టి రాంబాబు నారా లోకేష్ గురించి కామెంట్ చేసారు. ఎర్ర బుక్కు వెర్రి సన్నాసి.. తెలుగుదేశం తెల్ల జెండా ఎత్తే వరకు వదిలేట్టు లేడు! అని ట్వీట్ చేసారు. ఈరోజు స‌భ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ విధంగా ట్వీట్ చేయ‌డంతో స‌పోర్ట‌ర్లు అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలంతో దూషిస్తున్నారు.