Ambati Rambabu: చంద్రబాబుకు ఎలాంటి గతి పడుతుందో త్వరలో చూస్తారు
Ambati Rambabu: రాజకీయ పరంగా జగన్ మోహన్ రెడ్డిపై కక్ష ఉంటే రాజకీయంగా తీర్చుకోవాలి కానీ శ్రీవారి పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం చాలా తప్పని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు. లడ్డూ విషయంలో అధికారులు అంత అజాగ్రత్తగా ఉంటారంటే ఎవరు నమ్ముతారు అని ప్రశ్నించారు.
“” చంద్రబాబు గారూ.. మీకు జగన్ అంటే కోపం. అది దేశం మొత్తం తెలుసు. మీరు జగన్‌పై కక్ష తీర్చుకోవాలంటే రాజకీయంగా తీర్చుకోండి. అంతేకానీ శ్రీవారిని అడ్డుపెట్టుకుని ఇవేం రాజకీయాలండీ..! ప్రజలు చూస్తున్నారు. కొన్ని కోట్ల ప్రజలు రోజూ శ్రీవారిని దర్శించుకుంటూ ఆయన ప్రసాదాన్ని ఆస్వాదిస్తుంటే అందులో గొడ్డు మాంసం ఉందని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది. ఏమన్నా అంటే ల్యాబ్ రిపోర్టులు అంటారు. అదే ల్యాబ్ రిపోర్టులో ఈ కచ్చితత్వమైన నివేదిక అని గ్యారెంటీ ఇవ్వలేం అని రాసుంది. పోనీ మీరు రుజువు చేస్తారా అంటే అదీ తెలీదు. మీకు అనుకూలంగా పనిచేసే పత్రికల్లోనే లడ్డూలో నెయ్యి కలుషితం అయినట్లు అనుమానం ఉందని రాస్తుంటే మీరు కన్ఫామ్ చేసేస్తే ఎలా? మీకు అనుమానం ఉందంటే కచ్చితంగా విచారణ చేయించండి. మేం దేనికైనా సిద్ధం. మీరు ఇదంతా జగన్‌పై కక్ష సాధించడం కోసం చేస్తున్నారని తెలుసు. కానీ దానికి శ్రీవారిని అడ్డుపెట్టుకున్నారు. అది చాలా తప్పు. దీనికి శ్రీవారే చంద్రబాబుకు ఎలాంటి శిక్ష వేస్తారో త్వరలో మీరే చూస్తారు “” అని వెల్లడించారు.