Ambati Rambabu: నిమ్మల రామానాయుడుపై అంబటి ప్రశంసలు
Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రాంబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడుపై ప్రశంసలు కురిపించారు. బుడమేరు వాగు పొంగి పొర్లడంతో విజయవాడ వరదల్లో మునిగిన నేపథ్యంలో మూడు రోజుల పాటు రామానాయుడు నిద్రాహారాలు మాని మరీ గండ్లు పూడ్చే పనిలో ఉన్నారు. ఆయన పని పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా మెచ్చుకున్నారు.
దీనిపై అంబటి రాంబాబు స్పందించారు. “” ఏమాటకామాట చెప్పుకోవాలి. రామానాయుడు చాలా మంచి వాడు. పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. నేను ఎలాగైతే జగన్ పట్ల పార్టీ పట్ల అభిమానంతో చొక్కాకు స్టిక్కర్ అంటించుకుంటానో ఆయన కూడా ఎప్పుడూ పసుపు రంగు చొక్కా వేసుకుంటాడు. ఇక్కడి వరకు ఆయన మంచివాడే. కానీ గొడుగు పట్టుకుని ఫోటోలకు పోజులిస్తూ ఒక ఇరిగేషన్ మంత్రి గండ్లు పూడ్చే పనిలో పాల్గొనడం ఏంటండి? ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం. పిఠాపురంలో వరదలు వస్తాయేమో అని భావించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం కాబట్టి స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. అందులో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ కూడా చీపురు పట్టుకుని ఊడిస్తే 24 గంటలూ పేపర్లలో, టీవీల్లో ఇదే వార్త అవుతుంది. కానీ పవన్ ఇలాంటి పబ్లిసిటీ వద్దు అనుకున్నారు కాబట్టే మౌనంగా తన పని తాను చేసుకుని వెళ్లిపోయారు “” అని అంబటి వ్యాఖ్యానించారు.