Ambati Rambabu: చంద్రబాబు ప‌వ‌న్‌కు ఓ దండం నాయ‌నా

ambati rambabu asks chandrababu naidu to pass a go on not cleaning trash

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబ‌టి రాంబాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై సెటైర్లు వేసారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో చెత్తకు నిప్పు పెడుతున్నా ఫైల్స్ త‌గ‌ల‌బెట్టేసామ‌ని ఏదో స్కాం చేసేసామ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. చంద్ర‌బాబు ప‌వ‌న్‌కు ఓ దండం అని అన్నారు. అలాంట‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఎక్క‌డా చెత్తకు నిప్పు పెట్ట‌కూడ‌దు అస‌లు చెత్తే శుభ్రం చేయ‌కూడ‌దు అని GO పాస్ చేయించాల‌ని సెటైర్ వేసారు.

పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంపై చ‌ర్చకు రావాల‌ని రిక్వెస్ట్ చేసాన‌ని.. కానీ ఇరిగేష‌న్ మంత్రి రామానాయుడు నిన్న బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌ను బట్టి చూస్తే త‌న‌కు రావాల్సిన స‌మాధానాలు వ‌చ్చేసాయ‌ని.. కాబ‌ట్టి ఆ రిక్వెస్ట్‌ను వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని అన్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌న్న ఉద్దేశంతో డ‌యాఫ్రం వాల్, కాఫ‌ర్ డ్యాం, స్పిల్ వేలు అన్నీ క‌లిపి ఒకేసారి నిర్మించేసామ‌ని అందుకే పోల‌వ‌రం ప‌నులు ఆగిపోయామ‌ని రామానాయుడే స్వ‌యంగా ఒప్పేసుకున్నార‌ని.. తాను ముందు నుంచీ చెప్తున్న‌దే నిజం అయ్యింద‌ని అన్నారు.