Ambati Rambabu: ఈనాడు రిపోర్ట‌ర్ల‌కు సమాధానాలు చెప్ప‌ను

ఈనాడు రిపోర్ట‌ర్ల‌పై (eenadu) మండిప‌డ్డారు YSRCP నేత అంబ‌టి రాంబాబు (ambati rambabu). ఈరోజు ఆయ‌న నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో ఈనాడు రిపోర్ట‌ర్ కూడా పాల్గొన్నారు. రాంబాబును ఏదో ప్ర‌శ్న అడ‌గ‌బోతే.. “” నువ్వెవ‌రు అస‌లు.. ABN రాధాకృష్ణ‌, ఈనాడు రామోజీరావుకు అడ‌గ‌మ‌ని చెప్పిన ప్ర‌శ్న‌లు అడిగే నీకు స‌మాధానాలు చెప్పాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఇది ప్రెస్ మీట్. మీరు ప్ర‌శ్న‌లు అడిగితే నాకు స‌మాధానాలు చెప్పాలనిపిస్తేనే చెప్తాను. లేదంటే లేదు. అస‌లు నీకు నేనెందుకు స‌మాధానాలు చెప్పాలి “” అని నోటికొచ్చిన‌ట్లు రాంబాబు మాట్లాడ‌టంతో స‌ద‌రు రిపోర్ట‌ర్ వాకౌట్ చేసారు.