Alleti Maheshwar Reddy: తెలంగాణ బాగుండాల‌నే ఏపీకి ప్ర‌త్యోక హోదా ఇవ్వ‌లేదు

Alleti Maheshwar Reddy reveals why bjp did not give special status to ap

 

Alleti Maheshwar Reddy:  నిన్న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు కానీ ప్ర‌త్యేక ప్యాకేజీలు మాత్రం ప్ర‌కటించారు. కానీ అస‌లు తెలంగాణ‌కు మాత్రం ఏమీ ఇవ్వ‌లేదు. దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి వింత స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ ఎడారి కావొద్దని ఏపీకి రూ. 15 వేల కోట్లు ఇచ్చామ‌ని.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే తెలంగాణ ఎడారి అయ్యేదని అన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీకి తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చెయ్యాలని చెప్ప‌డం విడ్డూరంగా ఉంది.