Mallu Bhatti Vikramarka: తెలంగాణ చ‌రిత్ర‌లోనే తొలి దళిత డిప్యూటీ సీఎం

Mallu Bhatti Vikramarka: తెలంగాణ చ‌రిత్ర‌లోనే తొలి ద‌ళిత డిప్యూటీ సీఎంగా నిలిచారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy)  క్యాబినెట్‌లో చోటు ద‌క్కించుకున్న భ‌ట్టి విక్ర‌మార్క కూడా సీఎం ప‌ద‌విని ఆశించారు. ఆయ‌న కూడా సీఎం ప‌ద‌వికి అర్హుడే అని అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయ‌న తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1300 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేసిన నేత‌. కానీ ఈసారికి ఆయ‌న డిప్యూటీ సీఎంతో స‌రిపెట్టుకోవాల్సి వచ్చింది.

2018 ఎన్నిక‌ల్ స‌మ‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి KCR.. గెలిస్తే ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని అన్నారు. కానీ ఆయ‌న చేయ‌లేదు. ఈ పాయింట్‌పై ప్ర‌స్తుత సీఎం రేవంత్ గ‌ట్టిగా వాదించారు. అయితే కాంగ్రెస్ గెలిస్తే ద‌ళిత నేత సీఎం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయేమో అని చాలా మంది అనుకున్నారు కానీ అలా కుద‌ర‌లేదు. క‌నీసం డిప్యూటీ సీఎం ప‌ద‌వి అయినా ద‌ళిత నేత‌కు ద‌క్కింది అని ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.