Mahalakshmi Scheme: ఇది ఎవరికి వర్తిస్తుంది.. అందరు మహిళలకీ డబ్బు రాదా?
Mahalakshmi Scheme: కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇంకో నాలుగు హామీలపై కూడా కసరత్తు చేస్తున్నామని అవి కూడా త్వరలో అమలు చేస్తామని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2000 ఇవ్వబోతున్నారు. అయితే ఈ మహాలక్ష్మి పథకం ఎవరికి వర్తిస్తుంది? అందరు మహిళలకూ డబ్బు అందుతుందా లేదా అనే అంశాల గురించి తెలుసుకుందాం.
కర్ణాటకలో గృహలక్ష్మి పేరిట..
కర్ణాటకలో కూడా తెలంగాణ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అందుకే కర్ణాటకలో వర్కవుట్ అయిన అన్ని పథకాలను తెలంగాణలోనూ అమలు చేయాలని అనుకున్నారు. అయితే.. కర్ణాటకలో ఈ గృహలక్ష్మి పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నిరుపేద మహిళలకు మాత్రమే రూ.2000 ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఈ పథకం వర్తించదు.
పన్ను చెల్లింపుదారులు సైతం ఈ పథకానికి అనర్హులే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుపేద మహిళలు ఉన్నారు. ఈ 20 లక్షల మంది నిరుపేద మహిళలకు నెలకు రూ.2000 ఇవ్వాలంటే దాదాపు రూ.6 కోట్ల నిధులు ఖర్చు అవుతాయని అంచనా.