Election Special: భారత్‌లోనే కాదు.. 30 దేశాల్లోనూ మన ఇంకే..!
Election Special: రేపే తెలంగాణలో పోలింగ్. ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఇక మనం మన ఓటు హక్కును వినియోగించుకోవడమే ఆలస్యం. ఓటు వేసాక మన వేలిపై ఇంక్ (election ink) మార్క్ వేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఈ ఇంక్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
*ఈ ఇంక్‌ను 1960ల నుంచి వాడుతున్నారు. R&D ఆర్గనైజేషన్ ఈ ఇంక్‌ను తయారు చేసేది. ఆ తర్వాత దీనిని మైసూర్‌కు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది.
*ఈ ఇంక్ వేలిపై వేయగానే కొన్ని గంటల్లోనే పోదు. ఒకప్పుడు అయితే కొన్ని నెలల పాటు ఉండేది. ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆ మార్క్ అలాగే ఉంటుంది.
*1962లో జాతీయ ఎన్నికల కమిషన్.. జాతీయ ఫిజికల్ ల్యాబొరేటరీ, జాతీయ పరిశోధనా కేంద్రం కలిసి కర్ణాటకకు చెందిన ప్రభుత్వ పెయింట్స్ సంస్థ అయిన మైసూర్ పెయింట్స్‌తో ఒప్పందం కుదుర్చుని వారు తయారుచేసే ఇంక్‌నే భారత్‌లో జరిగే అన్ని ఎన్నికలకు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
*ఈ మైసూర్ పెయింట్స్ సంస్థ కేవలం భారత్‌కు మాత్రమే కాదు దాదాపు 30 దేశాలకు ఈ ఎన్నికల ఇంక్‌ను సరఫరా చేస్తోంది.
*ఈ ఇంక్‌లో సిల్వర్ నైట్రేట్‌ను వాడతారు. అందుకే ఇది అంటిన వెంటనే పోవడానికి కొన్ని వారాలు పడుతుంది.
*ఈ సిల్వర్ నైట్రేట్ చర్మంలోని ప్రొటీన్‌తో కలిస్తే డార్క్ మచ్చగా మారిపోతుంది. మన చర్మంలో మృతకణాలు తొలగిపోయి కొత్త కణాలు పుట్టుకొచ్చినప్పుడే ఆ ఇంక్ మరక పోతుంది.
*ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు ఇంక్ సరఫరా చేసేముందు ఆ ఇంక్‌ను పలుమార్లు టెస్ట్ చేస్తారు. కొందరు నకిలీ ఇంక్‌లను తయారుచేసి అమ్ముతున్నారన్న అనుమానాలు రావడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
*ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఇన్‌విజిబుల్ ఇంక్ తయారుచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఇన్‌విజిబుల్ ఇంక్ వేలిపై వేయగానే కనిపించదు. యాంబర్ లైట్ వేసి చూస్తేనే కనిపించేలా దీనిని తయారుచేస్తున్నారట.