Elections: ముఖ్య అంశాలు.. ప్ర‌శ్న‌లు.. స‌మాధానాలు!

Elections: భార‌త‌దేశంలోనే అతిపెద్ద ఎన్నిక‌ల న‌గారా మోగింది. లోక్ స‌భ ఎన్నిక‌లతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు కూడా జ‌ర‌గబోతున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం..!

2024లో లోక్ స‌భ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గ‌నున్నాయి?

ఏప్రిల్ 19 నుంచి ఏడు ద‌శ‌ల్లో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. తొలి ద‌శ ఓటింగ్ ఏప్రిల్ 19న‌, రెండో ద‌శ ఓటింగ్ ఏప్రిల్ 26న‌, మూడో ద‌శ ఓటింగ్ మే 7న‌, నాలుగో ద‌శ ఓటింగ్ మే 13న‌, ఐదో ద‌శ ఓటింగ్ మే 20న‌, ఆరో ద‌శ ఓటింగ్ మే 25న, చివ‌రి ద‌శ ఓటింగ్ జూన్ 1న ముగుస్తాయి.

కౌంటింగ్ ఎప్పుడు జ‌రుగుతుంది?

అన్ని ఎన్నిక‌ల‌కు కౌటింగ్ జూన్ 4న జ‌రుగుతుంది. అంటే జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

ఎంత మంది ఓటు వేస్తారు?

ఈసారి దాదాపు 96.8 కోట్ల మంది ఓట‌ర్లు తమ ఓటు హ‌క్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో ఇటీవ‌ల 18 ఏళ్లు నిండిన‌వారి సంఖ్య 1.8 కోట్లు.

ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలి?

ఫాం 6 ద్వారా త‌మ వివ‌రాల‌ను నమోదు చేసి ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని అనుకంటున్నారో ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్‌కి (ERO) కానీ.. అసిస్టెంట్ ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్‌కి (AERO) కానీ ఫాంను స‌బ్మిట్ చేయాలి. ఒక‌వేళ విదేశాల్లో ఉంటున్న వారైతే ఫాం 6A ద్వారా స‌బ్మిట్ చేయొచ్చు.

ఎన్ని లోక్ స‌భ సీట్ల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది?

543 సీట్లు.

ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి?

4. ఆంధ్ర‌ప్ర‌దేశ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, సిక్కిం, ఒడిశా

మీ పేరు న‌మోదై లేక‌పోతే ఏం చేయాలి?

మీకు ద‌గ్గ‌ర్లోని ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యానికి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. లేదా www.nvsp.in అనే నేష‌న‌ల్ ఓట‌ర్స్ పోర్ట‌ల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

నోటా ఓట్లు ఎక్కువ‌గా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్. అక్టోబ‌ర్ 13న నోటాను ప్ర‌వేశ‌పెట్టారు.