Mahalakshmi Scheme: గృహిణులకు రూ.2500.. ఎప్పటినుంచి?
Mahalakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుందో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తెలంగాణలో మొత్తం కోటి రూ.62 లక్షల మంది మహిళలు ఉన్నాయి. దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నెల చివర్లో మహిళల ఖాతాల్లో రూ.2500 పడతాయని అధికారులు చెప్తున్నారు.
ఎవరికి వర్తిస్తుంది?
BPL కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
తెలంగాణ మహిళలకే ఇస్తారు
ఇంట్లో మహిళే పెద్ద దిక్కుగా ఉండాలి
వివాహం అయ్యి ఉండాలి
కుటుంబంలోని ఎవరో ఒక మహిళకే ఈ పథకం వర్తిస్తుంది
గృహిణి కుటుంబంలో వార్షిక ఆదాయం రూ.2లక్షల కంటే తక్కువ ఉండాలి.