EXCLUSIVE: జనసేన త్యాగం.. తెనాలి ఆలపాటి రాజాదే..!
EXCLUSIVE: కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఈ సామెత ఇప్పుడు జనసేన (janasena) పార్టీకి బాగా వర్తిస్తుంది. ముందు వెనక ఆలోచించకుండా తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జైల్లో ఉన్నారు కదా అని వెళ్లి ఆయనతో నేరుగా పొత్తు పెట్టేసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan). ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో తడబడుతున్నారు. నాదెండ్ల మనోహర్ (nadendla manohar) అడ్డా అయిన తెనాలి నుంచి ఆలపాటి రాజా పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందుకు ముందు జనసేన ససేమిరా అన్నప్పటికీ ఇక చేసేదేమీ లేదు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా అన్నట్లు నాదెండ్ల వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
ఆలపాటికే వారి సపోర్ట్
మరోపక్క తెనాలి, రాజమండ్రిలో రూరల్ తెలుగు దేశం పార్టీ రెబెల్స్ ఆలపాటికి కాకుండా నాదెండ్లకు సీటు ఇస్తే ఊరుకునేది లేదని.. అంతా కలిసి జనసేనను ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు. ఎంత చెప్పినా సీటు జనసేనకు ఇస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అయినా జనసేనను ఓడిస్తామని అంటున్నారు.