Akula Venkateshwara Rao: చంద్ర‌బాబు అరెస్ట్.. స్వీట్ల పంపిణీ

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయిన నేప‌థ్యంలో అదే పార్టీకి చెందిన ఆకుల వెంక‌టేశ్వ‌ర‌రావు (akula venkateshwara rao) స్వీట్లు పంచిపెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత‌కాలంగా TDPలో వెంక‌టేశ్వ‌ర‌రావు అస‌మ్మ‌తి నేత‌గా ఉంటున్నారు. త‌న‌కు నారా లోకేష్ (nara lokesh) నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని ఆయ‌న ఓసారి మీడియా ముందు వెల్ల‌డించ‌డం వైర‌ల్‌గా మారింది. ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్ట్ అవ్వ‌డంతో పండుగ చేసుకుంటున్నారు.