Akhilesh Yadav: ఒకే దేశం ఒకే ఎన్నిక‌.. UPలో మొద‌లెట్టండి

కేంద్ర ప్ర‌భుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక (one nation one election) చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తీసుకురావ‌డానికి మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌మాజ్‌వాది పార్టీ (samajwadi party) అధినేత అఖిలేష్ యాద‌వ్ (akhilesh yadav) స్పందిస్తూ.. ఆ ఎన్నిక‌లు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో (uttar pradesh) నిర్వ‌హించి చూడాల‌ని పిలుపునిచ్చారు. క‌నీసం దీని ద్వారా అయినా ప్ర‌జ‌ల‌కు BJPపై ఎంత కోపం ఉందో కేంద్ర ప్ర‌భుత్వానికి ముందే తెలుస్తుందని తెలిపారు.

“” ఏదైనా భారీ ప్రాజెక్ట్ చేప‌ట్టే ముందు ప్ర‌యోగం చేయ‌డం ఎంతో మంచిది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును పాస్ చేసే ముందు ఓసారి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హించి చూడండి. దీని ద్వారా BJPపై ప్ర‌జ‌ల‌కు ఎంత కోపం ఉందో తెలీడ‌మే కాదు ఎన్నిక‌ల క‌మిష‌న్ సామర్ధ్యం, ప్ర‌జ‌ల అభిప్రాయాలు కూడా తెలుసుకోవ‌చ్చు “” అని ఎగ‌తాళి చేస్తున్న‌ట్లు కామెంట్ చేసారు అఖిలేష్. (akhilesh yadav)