Akhilesh Yadav: మళ్లీ అధికారంలోకి జగన్ వస్తారు.. భయపెట్టే వారు సీఎం కాలేరు
Akhilesh Yadav: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని.. ఎవరైతే కార్యకర్తలు, పార్టీ నేతల కోసం పోరాడతారో వారే అధికారంలో ఉంటారని సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ తన మద్దతు తెలిపేందుకు జగన్ వద్దకు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “” ఇక్కడికి రాకపోతే నాకు నిజాలు తెలిసి ఉండేవి కావు.. అధికారంలో ఉన్న వారికి సంయమనం ఉండాలి. బుల్డోజర్ సంస్కృతికి మేము వ్యతిరేకం.. ప్రభుత్వం ఏం చెప్పదల్చుకుంది? ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు.. జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బూటకపు ఎన్కౌంటర్లు కూడా మేము చూసాం. భయపెట్టే వాడు ముఖ్యమంత్రి కాలేడు. ఈసారి మళ్లీ అధికారంలోకి జగనే వస్తారు “” అని తెలిపారు.