Ajit Pawar: బాబాయ్‌నే తీసేసిన అజిత్..!

Delhi: శ‌ర‌ద్ ప‌వార్ (sharad pawar) స్థాపించిన నేష‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ncp) నుంచి ఆయ‌న్నే తొల‌గించేసారు అజిత్ ప‌వార్ (ajit pawar). ఈరోజు బ‌ల‌నిరూప‌ణలో అజిత్‌కే ఎక్కువ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండ‌టంతో పార్టీ చీఫ్‌గా తానే ఉంటాన‌ని ప్ర‌క‌టించి శ‌ర‌ద్‌ను తొల‌గించేసారు. అయితే అజిత్ పవార్ (ajit pawar) త‌న‌కు ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 2004లో పోటీ చేసిన‌ప్పుడు కాంగ్రెస్ కంటే త‌మ‌కే ఎక్కువ సీట్లు వ‌చ్చాయ‌ని, అప్పుడు సీఎం అయ్యే అవ‌కాశం ఉన్నా వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని అజిత్ అన్నారు. ఇప్పుడు శ‌ర‌ద్ ప‌వార్ (sharad pawar) ఆశీర్వాదంతోనే ప‌నిచేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు.