Ajit Pawar: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి..!
NCP నుంచి మేనమామ శరద్ పవార్ (sharad pawar) నుంచి విడిపోయిన అజిత్ పవార్.. (ajit pawar) BJP, శివసేన కూటమిలో కలిసిపోయారు. ఇప్పుడు తను ఉన్న కూటమికి మహాయుతి (mahayuti) అని పేరుపెట్టారు. అయితే అసలు ఎందుకు తన మేనమామ నుంచి విడిపోవాల్సి వచ్చిందో అజిత్ పవార్ వివరించారు. మహారాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడానికే తాను ఎన్సీపీ నుంచి విడిపోయానని అన్నారు. రాజకీయాల్లో ఎవరికి ఎవ్వరూ ఎప్పటికీ స్నేహితులు గానూ శత్రువులుగానూ ఉండిపోరని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే మేనమామను వదిలేయాల్సి వచ్చిందే కానీ ఆయనపై ప్రేమ గౌరవం లేక కాదు అని క్లారిటీ ఇచ్చారు. (ajit pawar)