Tammineni Veerabhadram: పరిస్థితి విషమం.. వైద్యులు ఏం చెప్తున్నారు?
Tammineni Veerabhadram: CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌కు తరలించారు. నిన్నటివరకు ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. ఈరోజు ఆయన ఆరోగ్యం కాస్త విషమించినట్లు తెలుస్తోంది. ఆయన గుండె అసాధారణంగా కొట్టుకుంటోందని.. కిడ్నీల్లోనూ సమస్య ఉందని వైద్యులు చెప్తున్నారు. ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరిందని.. బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈరోజు పరిస్థితి మెరుగుపడితే ఐసీయూ నుంచి వేరే గదిలోకి షిఫ్ట్ చేస్తామని వెల్లడించారు.