AIADMK: BJPతో పొత్తు.. ఇప్పుడే వ‌ద్దు

BJPతో ఇప్పుడే పొత్తు పెట్టుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది AIADMK . ఎన్నిక‌ల స‌మ‌యంలో (lok sabha elections) పొత్తు గురించి ఆలోచిస్తామ‌ని వెల్ల‌డించింది. త‌మిళ‌నాడు BJP రాష్ట్ర అధ్యక్షుడు అన్న‌మ‌లై దివంగ‌త నేత‌ల గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని గ‌తంలో దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గురించి కూడా త‌ప్పుగా మాట్లాడాడ‌ని నేత‌లు ఆరోపిస్తున్నారు. అస‌లు ఆయ‌న‌కు BJP రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉండే అర్హ‌తే లేద‌ని మండిప‌డుతున్నారు. అన్న‌మ‌లై కార‌ణంగానే పొత్తుకు బ్రేక్ ఇచ్చిన‌ట్లు తెలిపారు.