Telangana Elections: గెలుపెవరిదో..!
తెలంగాణలో ఎన్నికల (telangana elections) నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలు ప్రచారంపై బాగా ఫోకస్ చేస్తున్నాయి. అసలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి.. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి.. వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోయే అతి ముఖ్యమైన పార్టీలు భారత రాష్ట్ర సమితి (BRS), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (congress), బహుజన్ సమాజ్ పార్టీ (BSP). ముందుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి గురించి చూద్దాం. 2022 వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఈ పార్టీ.. భారతీయ జనతా పార్టీకి పోటీగా జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రణాళికలు వేసింది. అలా తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. BRSగా మారాక ఈ పార్టీకి ఇది మొదటి ఎన్నిక అనే చెప్పాలి.
తెలంగాణలో తమ ఉనికిని బలపరుచుకునేందుకు BRS ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మరి అన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు కచ్చితంగా ఈ సారి కూడా BRS గెలుస్తుందా.. అంటే కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మంచితో పాటు చెడు కూడా ఉంటుంది కదా..! TSPSC పేపర్ లీక్ అవ్వడం ఈసారి బీసీ అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వకపోవడం.. పలువురు ఎమ్మెల్యే అభ్యర్ధులపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలతో పై కాస్త ప్రభావం పడేలా ఉంది. మరోపక్క తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR 30న ఎన్నికలు జరుగుతున్నాయని 30లో 3 అనే నెంబర్ KCR మళ్లీ మూడోసారి సీఎం అవుతారని సూచిస్తోందని అన్నారు. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే.. BRS ఏ పార్టీతోనూ పొత్తులకు పోకుండా సింగిల్‌గా బరిలోకి దిగనుంది. (telangana elections)
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. దాదాపు 150 ఏళ్ల నాటి పార్టీ. తెలంగాణలో ఏకైక అతిపెద్ద పార్టీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం.. భారత్ జోడో యాత్రలతో కాంగ్రెస్ BRSకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో BRSకి కాంగ్రెస్‌కి పాపులారిటీ బాగా ఉంది. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇటీవల సోనియా గాంధీ కర్ణాటకలో మాదిరిగా ఆరు హామీలను ప్రకటించారు. ఇవి ప్రజలను టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయనే చెప్పాలి. కాకపోతే ఒకవేళ కాంగ్రెస్ సోలోగా గెలిచినా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా సీఎం అభ్యర్ధి మాత్రం ఎవ్వరూ లేరు. అదీకాకుండా అంతర్గతంగా నేతల మధ్య సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ తరఫున నిలబడే స్ట్రాంగ్ లీడర్లు కూడా లేకపోవడం పార్టీకి మైనస్ పాయింట్.
భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. BJP కేవలం ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పాపులారిటీపై ఆధారపడి ఉంది. పసుపు బోర్డు, గిరిజనుల కోసం యూనివర్సిటీలను ప్రకటించి ప్రజలను తమవైపు తిప్పుకోవాలని అనుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అంటూ చేరికలు ఎక్కువ అవడం.. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలు బయటికి వెళ్లడంతో అంతర్గత సమస్యలు ఉన్నాయి. BCలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో BJPకి వ్యతిరేకత తప్పదు. (telangana elections)
ఇక చివరిగా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూడా బరిలోకి దిగనుంది. ప్రవీణ్ కుమార్ సామాజిక న్యాయ పోరాటాల పేరుతో ప్రజల సపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే బహుజన్ సమాజ్ పార్టీకి ఆస్కారమున్న ప్రదేశాల్లోనే పోటీ చేసి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కొత్త ప్రాంతాల్లో మాత్రం కుదరదు.
ఎన్నికల్లో స్వింగ్ ఓటర్ల ప్రభావం ఉండనుంది. స్వింగ్ ఓటర్లు అంటే వారు ఒక పార్టీకే ఓటు వేయాలని అనుకోరు. ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటు వేస్తుంటారు. స్వింగ్ ఓటర్లు 5% ఉన్నారు. వీరి ఓట్లు అన్ని పార్టీలకు కీలకమే. కాబట్టి వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు కృషిచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో BRSకి గట్టి పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ ఓట్లు 30% ఉండాలి. మొదటిసారి ఓటు వేయబోయే వారి ప్రభావం కూడా ఈసారి ఎక్కువగా ఉండనుంది.