Telangana Elections: తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్ ఎవ‌రు?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌రికి వ‌చ్చేస్తున్నాయ్. బ‌రిలోకి దిగ‌నున్న పార్టీల ప్ర‌చార హంగామా మొద‌లైపోయింది. ద్వేషాలు, అల‌క‌లు, అవ‌మానాలతో వివిధ పార్టీలకు చెందిన నేత‌లు రాజీనామాలు చేసి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. బ‌రిలోకి ఏ పార్టీ దిగ‌నుంది.. ఎవ‌రు ఎక్క‌డ ప్రచారం చేస్తున్నారు అన్న వివ‌రాలు ఆల్రెడీ మ‌న‌కు పార్టీలు ప్ర‌క‌టించేసాయి.

ఈ విష‌యాల‌న్నీ ప‌క్క‌న‌పెడితే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప‌వ‌ర్‌ఫుల్ నేత ఎవ‌రు అనే దానిపై గూగుల్‌లో తెగ వెతికేస్తున్నార‌ట‌. మ‌రి గూగుల్ ప్ర‌కారం చూసుకుంటే యావ‌త్ తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ఫుల్ నేత ఎవ‌రో కాదు.. కాంగ్రెస్ నేత‌, TPCC అధ్య‌క్షుడు అనుమ‌ల రేవంత్ రెడ్డి (revanth reddy). షాకింగ్‌గా ఉంది క‌దూ..! మ‌రి గూగుల్ ఏ డేటా ఆధారంగా ఇలా చెప్తోందో తెలీడంలేదు కానీ రేవంత్ రెడ్డే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్ అట‌. ఈ విష‌యంపై మ‌రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.