Praja Darbar: ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
Praja Darbar: అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి (kiran kumar reddy) సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ప్రజా దర్బార్ మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి (revanth reddy) సీఎం అయ్యాక జరుగుతోంది. ప్రజా దర్బార్ ఉందని తెలిసి ప్రజలు తమ సమస్యలను సీఎంతో చెప్పుకోవడానికి తండోప తండాలుగా కదిలారు. దాంతో ప్రగతి భవన్ కళకళలాడిపోయింది. ఈ దర్బార్‌లో సీఎంతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు.