Lok Sabha Elections: ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
ఇస్రో (isro) ఇప్పటివరకు మూడు సార్లు చంద్రయాన్ (chandrayaan) మిషన్‌ను చేపట్టింది. మొదటిది సక్సెస్ అయినప్పటికీ రెండోది మాత్రం పేలిపోయింది. ఇక నిన్న మూడో మిషన్‌తో భారతదేశం చరిత్రను తిరగరాసింది. అయితే చంద్రయాన్ మిషన్‌కు లోక్ సభ ఎన్నికలకు (lok sabha elections) ఒక సంబంధం ఉంది. అదేంటంటే.. ఇస్రో ఎప్పుడు చంద్రయాన్ మిషన్‌ను చేపట్టినా.. ఆ మరుసటి ఏడాది కేంద్రంలోని ప్రభుత్వం మారుతూ వచ్చింది.
ఇస్రో మొదటి చంద్రయాన్ మిషన్‌ను 2008 నుంచి 2009 మధ్యలో చేపట్టింది. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ (congress) అధికారంలో ఉండగా.. మన్మోహన్ సింగ్ (manmohan singh) ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రెండో చంద్రయాన్ మిషన్‌ను 2019లో చేపట్టింది. అప్పటికి కాంగ్రెస్ పోయి అధికారంలోకి BJP వచ్చింది. నరేంద్ర మోదీ (narendra modi) ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇప్పుడు చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మరి మోదీ చెప్పినట్లు మళ్లీ తానే అధికారంలోకి వస్తారో లేదో వేచి చూడాలి. (lok sabha elections)
క్రెడిట్ కొట్టేసిన ప్రధాని
చంద్రయాన్-1 (మాంగళ్యాన్) మిషన్ విజయవంతం అయ్యాక అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ టీవీలో కనిపించలేదు. మొత్తం క్రెడిట్ ఇస్రో శాస్త్రవేత్తలకే ఇచ్చారట. కానీ నిన్న చంద్రయాన్ -3 విజయవంతం అయ్యాక నరేంద్ర మోదీ టీవీలో కనిపించి క్రెడిట్ మొత్తం తానే తీసుకున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.