KTR: చాలా రోజుల త‌ర్వాత హాయిగా నిద్ర‌పోయా

చాలా రోజుల త‌ర్వాత ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాన‌ని అంటున్నారు KTR. ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఎంతైనా ఊద‌ర‌గొట్ట‌చ్చు కానీ డిసెంబ‌ర్ 3న ఎగ్జాక్ట్ పోల్స్ (exact polls) BRS పార్టీకి శుభ‌వార్త అందిస్తాయ‌ని ఆశిస్తున్న‌ట్లు ట్వీట్ చేసారు. నిన్న తెలంగాణ‌లో పోలింగ్ ప్ర‌క్రియ పూర్తైన వెంట‌నే ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. దాదాపు అన్ని స‌ర్వేలు తెలంగాణలో కాంగ్రెసే అధికారంలోకి రాబోతున్న‌ట్లు వెల్ల‌డించ‌డంతో KTR కాస్త సీరియ‌స్ అయ్యారు. క‌చ్చితంగా మూడోసారి కూడా తామే గెల‌వ‌బోతున్నామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.