Adinarayana Reddy: BJPలో ఉన్నా కాబట్టి జగన్ నుంచి బతికిపోయా.. TDPలో ఉంటే అంతే..
Adinarayana Reddy: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాను కాబట్టే జగన్ మోహన్ రెడ్డి నుంచి తప్పించుకోగలిగానని అన్నారు జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి. తాను భారతీయ జనతా పార్టీలో చేరాక ఓసారి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసానని.. ఆ సమయంలో ఆయన పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.
తాను అందుకు ఒప్పుకోలేదని.. రఘురామ కృష్ణంరాజుకు సగం సినిమా చూపించిన జగన్.. తాను తెలుగు దేశం పార్టీలో ఉండి ఉంటే పూర్తి సినిమా చూపించేవాడని అన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నందువల్లే తనపై జగన్ ఎన్ని తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూసినా హైకమాండ్ తనను రక్షించిందని లేకపోతే ఏమైపోయేవాడినో తెలీదని అన్నారు. 100 రోజుల్లో జమ్మలమడుగులో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని.. అలా చేయకపోతే 100 రోజుల తర్వాత తనను మీడియా సాక్షిగా నిలదీసే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు.