EXCLUSIVE: “అద్దంకి దయాకర్‌కు సీటు ఇవ్వకపోతే ఊరుకోం”
EXCLUSIVE: తెలంగాణలో కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ సీట్ల లొల్లి ఎక్కువైంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు (addanki dayakar) ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోతే ఊరుకోమంటూ ఆయన కార్యకర్తలు బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కూర్చుని ధర్నా చేస్తున్నారు. అద్దంకికి అన్యాయం చేస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ హైకమాండ్‌కే వార్నింగ్‌లు ఇస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రకులాల కుట్ర వల్లే అద్దంకికి టికెట్ రాకుండాపోయిందని… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అద్దంకికి మంచి పేరు ఉందని ఆయన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అద్దంకికి టికెట్ ఇవ్వకపోవడం తమ కులానికి అన్యాయం చేసినట్లే అని విమర్శలు చేస్తున్నారు.