Sivaji: ప్ర‌జ‌లు ఊహించ‌ని విధంగా కూట‌మి గెల‌వ‌బోతోంది

actor sivaji slams jagan mohan reddy government

Sivaji: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు, ఇత‌ర పార్టీల నాయ‌కులు ఊహించ‌ని రీతిలో కూట‌మి (తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు) గెల‌వ‌బోతున్నాయ‌ని అన్నారు ప్ర‌ముఖ న‌టుడు శివాజీ. ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌ళ్లీ గెల‌వాల‌ని ప్ర‌స్తుత ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి జగ‌న్ మోహన్ రెడ్డి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని.. మ‌ళ్లీ ఏ ముఖం పెట్టుకుని అధికారం కావాల‌ని అడుగుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు జ‌గ‌న్ చేతిలో ఎలా న‌లిగిపోయారో వివ‌రించాలంటేనే ఎంతో బాధ‌గా ఉంద‌ని.. అందుకే మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నాన‌ని తెలిపారు.

“” ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అభ‌ద్ర‌తా భావంలో ఉన్నారు. ఏం మాట్లాడాల‌న్నా కేసులు పెడ‌తారేమో అని భ‌య‌ప‌డుతున్నారు. రాష్ట్రంలో అస‌లు ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ లేదు. పోలీసుల వ్య‌వ‌స్థ‌ను అడ్డుపెట్టుకుని జ‌గ‌న్ ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించాడు “” అని తెలిపారు