లిప్‌స్టిక్ వేసుకున్న వారికే రిజ‌ర్వేష‌న్ బిల్లు..!

RJD సీనియ‌ర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ (abdul bari siddiqui)  మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు (women’s reservation bill) గురించి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. లిప్‌స్టిక్స్ పెట్టుకుని బాబ్ క‌ట్ ఉన్న మ‌హిళ‌లే ఈ బిల్లు గురించి మాట్లాడేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని.. వెనుక‌బ‌డిన కులాల‌కు చెందిన మ‌హిళ‌లు రావాల‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా లిప్‌స్టిక్ వేసుకుని పాష్‌గా ఉండేవారికే రిజ‌ర్వేష‌న్ పేరుతో అవ‌కాశాలు ఇస్తుంది కానీ ఎప్పుడూ కూడా వెనుక‌బ‌డిన వారికి ఇవ్వ‌ద‌ని అన్నారు. దాంతో ఆయ‌నపై వివిధ పార్టీల‌కు చెందిన‌ మ‌హిళా నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) అయ్యేవ‌ర‌కు RJD కార్య‌క‌ర్తలు మీడియాకు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.