AAP: ప్రతిపక్షాలు కలవకపోతే.. ఇక దేశంలో ఎన్నికలు ఉండవ్
Delhi: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి BJPని తరిమికొట్టకపోతే.. ఇక రానున్న కాలంలో దేశంలో ఎన్నికలే జరగవని అంటోంది ఆప్ (aap). ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ నరేంద్ర మోదీ (narendra modi) ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చేసి దేశానికే రాజు అయిపోతాడని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో BJP చేయిస్తున్న CBI, ED దాడులను చూస్తుంటే మోదీ రాజ్యాంగాన్నే మార్చేస్తారని అనిపిస్తోందని అన్నారు. ఈ నెల 23న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) నిర్వహించబోయే ప్రతిపక్షాల సమావేశంలో (opposition meeting) లోక్సభ ఎన్నికల్లో (lok sabha elections)ఎలా కలిసి పనిచేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.