Congress: తెలీక వాగింది.. పట్టించుకోకండి..!
కాంగ్రెస్ (congress) నేత అల్కా లంబా (alka lamba) చేసిన కామెంట్ పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (aap) అలిగింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) NDAని తరిమికొట్టాలని 26 అపోజిషన్ పార్టీలు అంతా కూటమిగా ఏర్పడి ఇండియాగా (I-N-D-I-A) మారాయి. ఈ కూటమిలో ఆప్ (aap) కూడా ఉంది. అలాంటిది.. రానున్న ఎన్నికల్లో దిల్లీలోని 7 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని హైకమాండ్ మీటింగ్‌లో చెప్పింది అని అల్కా లంబా మీడియా ముందు అన్నారు. ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ (rahul gandhi), మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) కూడా ఉన్నారని తెలిపారు. దాంతో ఆప్‌కి ఒళ్లు మండింది. ఇలా ఎవరికి వారు ఎక్కడ పోటీ చేసి ఎలా గెలవాలో నిర్ణయించేసుకుంటే ఇక ఇండియా కూటమి ఎందుకు అని ప్రశ్నించింది.
దీనిపై అల్కా లంబా ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. “” ఇంత పెద్ద రాద్దాంతం చేయాల్సినంతగా నేనేం అన్నాను? అసలు నేను మీడియాతో మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా పొత్తుల గురించి మాట్లాడానా? “” అని అన్నారు. అల్కా కామెంట్స్‌పై ఆప్ స్పందించింది. “” మీకు మీరే దిల్లీలోని అన్ని ఏడు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా? మరి మన కూటమి ఎందుకు? “‘ అని ప్రశ్నించారు. ప్రస్తుతం దిల్లీలోని 7 సీట్లలో BJPనే అధికారంలో ఉంది. అనవసరంగా ఎన్నికల ముందు కొట్లాటలు ఎందుకు అని కాంగ్రెస్ దిల్లీ ఇన్చార్జ్ దీపక్ బబారియా స్పందించారు. అల్కా ఏదో తెలీక వాగేసిందని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలి వంటి పెద్ద పెద్ద విషయాలపై మాట్లాడటానికి అల్కా సరైన వ్యక్తి కారని ఆప్‌కు అర్థమయ్యేలా చెప్పారు. ఎప్పటినుంచో కాంగ్రెస్ తరఫు పనిచేస్తున్న అల్కా లంబా 2014లో ఆప్‌లో చేరారు. ఆ తర్వాత 2019లో మళ్లీ ఆప్ నుంచి కాంగ్రెస్‌కి వచ్చేసారు.