AAP: కేజ్రీవాల్ కల్లోకి వచ్చారు.. BJPలో ఉండను సర్
AAP: రాజకీయ నేతలు ఎప్పటికప్పుడు వారికి నచ్చినట్లు పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారిన వారు మళ్లీ ఏదో ఒక రకంగా మనసు మార్చుకుని తిరిగి మళ్లీ అదే పార్టీలోకి చేరుతున్నవారినీ చూస్తూనే ఉన్నాం. అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ తొందరపాటులో భారతీయ జనతా పార్టీలో చేరి మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీలోకి రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది.
కౌన్సిలర్ అయిన రామ్ చందర్ నెల రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చేసారు. ఎందుకు పార్టీ మారారు మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చారు అని అడగ్గా.. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలలోకి వచ్చారని వెంటనే లేచి వెళ్లి ఇతర నేతలైన మనీష్ సిసోదియా, గోపాల్ రాయ్, సందీప్‌లను వెళ్లి కలవు అని చెప్పారట. దాంతో ఉదయాన్నే వెళ్లి మనీష్ సిసోదియాను కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటాను అని చెప్పాడు. ఇక మున్ముందు ఏ పార్టీ మాయ మాటలను నమ్మనని.. ఆమ్ ఆద్మీ పార్టీని విడిచి వెళ్లనని ఆయన వెల్లడించారు.