TDP Janasena Alliance: ప‌వ‌న్ లేక‌పోతే TDP లేన‌ట్టే..!

TDP Janasena Alliance: తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా వీరి పొత్తులో ఆల్మోస్ట్ భాగం అయిపోయింద‌నే చెప్పాలి. సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిన‌ట్లే అని తెలుస్తోంది. కాక‌పోతే అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార YSRCPకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ ఏద‌న్నా ఉందంటే అది తెలుగు దేశం పార్టీనే (Telugu Desam Party).

అయితే ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. జ‌న‌సేన (Janasena) ఓ ర‌కంగా తెలుగు దేశం పార్టీని దాటేసిన‌ట్లే అనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ కంటే జ‌న‌సేన చిన్న‌ది. ఏపీలో పెద్ద‌గా సీట్లు గెలవ‌ని పార్టీ. అలాంట‌ప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) చెప్పిన‌ట్లే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) వినాలి. వింటూ వ‌స్తున్నారు కూడా. అందుకే పాపం చంద్ర‌బాబు ఎలా చెప్తే అలా విని న‌డుచుకుంటున్నారు. ఎందుక‌న్నా నిన్ను నువ్వు త‌గ్గించుకున్నావ్ అని పార్టీ కార్య‌క‌ర్త‌లు అడుగుతున్నా కూడా.. ఏపీ బాగుండాలంటే కొన్ని చోట్ల త‌గ్గాలి తప్ప‌దు అని చెప్తుంటారు.

అయితే ఓ టాప్ స‌ర్వే బ‌య‌ట‌పెట్టిన వివ‌రాల ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని ద‌క్కించుకోవాలంటే జ‌న‌సేన పార్టీకి తెలుగు దేశం పార్టీ అవ‌స‌రం కాదు.. తెలుగు దేశం పార్టీకే జ‌న‌సేన‌తో పొత్తు ఎంతో అవ‌స‌రం అట‌. ఈ విష‌యాన్ని ఇండియా టుడే చేప‌ట్టిన స‌ర్వేలో తేలింది. జ‌న‌సేన రూట్ మార్చి ఒంట‌రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకుంటే తెలుగు దేశం పార్టీ త‌ట్టా బుట్టా స‌ర్దుకోవాల్సిందేన‌ట‌. తెలుగు దేశం పార్టీ నుంచి జ‌న‌సేన‌ను విడ‌దీస్తే మాత్రం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే (YS Jagan Mohan Reddy) అని ఇండియా టుడే కాన్ఫిడెంట్‌గా చెప్తోంది. ఆల్రెడీ పొత్తు ధ‌ర్మం పాటించ‌కుండా చంద్ర‌బాబు నాయుడు పోటీ చేయ‌బోయే నియోజ‌క‌వ‌ర్గం పేరు రివీల్ చేసేసి జన‌సేనానికి కోపం తెప్పించారు.

మ‌రోప‌క్క ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు ఎవ‌రు ఓడిపోతారు అన్న విషయం ప‌క్క‌న పెడితే.. ఎన్నిక‌ల్లో ఈసారి తెలుగు దేశం పార్టీ కంటే జ‌న‌సేన‌కే ఎక్కువ సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కొన్ని స‌ర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం ఓ పార్టీగా కుంగిపోయింద‌ట‌. మ‌ళ్లీ తేరుకోవ‌డానికి జ‌న‌సేన స‌పోర్ట్ తీసుకుంది. అంతేకానీ చంద్ర‌బాబు నాయుడు విజ‌న్‌ని చూసి జ‌నాలు ఓట్లు ఏమీ వేయ‌రు అన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ ఒంట‌రిగా ఉన్నా జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నా కూడా జీరోనే అని మ‌రికొంద‌రి వాద‌న‌. ఈసారి తెలుగు దేశం పార్టీ ఓడిపోతే ఇక పార్టీని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అని పిల‌వ‌డానికి కూడా ఉండ‌దు అంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇంకా అనుభ‌వం కావాలి కాబ‌ట్టి త‌న పూర్తి మ‌ద్దతును కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీకి (Bharatiya Janata Party) ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు.