Jagan పై ఎటాక్ చేసిన వ్య‌క్తి అరెస్ట్

Jagan: ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయితో దాడి చేసిన వారిలో ప్ర‌ధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన యువకుడితో పాటు రాయిని కూడా పోలీసులు గుర్తించారు. జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు టైల్స్ రాయిని వాడార‌ని.. టైల్స్ స‌తీష్ అనే యువకుడితో పాటు రాయిని గురి చూసి కొట్టడానికి సహకరించిన మరో అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.