Pawan Kalyan: సీఎం అని అరిచిన ఫ్యాన్స్.. చావబాదిన TDP కార్యకర్తలు
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (ap elections) పోటీ చేసి కేవలం ఎమ్మెల్యేగానే కాదు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఎందరో అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే పవన్ పెట్టిన మీటింగ్‌లు, ప్రచార సభల్లో పవన్ సీఎం అవ్వాలన్న వినికిడి ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రచార కార్యక్రమంలో జనసేన (janasena) కార్యకర్తలు పవన్ సీఎం పవన్ సీఎం అని కేకలు వేసారు. దాంతో అక్కడే ఉన్న తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు వారిని చావబాదారు. ఆ సమయంలో తీసిన వీడియో వివాదాస్పదంగా మారింది. (pawan kalyan)
అందుకే లోకేష్ ముందే క్లారిటీ ఇచ్చారా?
తెలుగు దేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో పవన్ సీఎం అయితే బాగుంటుందన్న మాట బలంగా వినిపిస్తుండడంతో ముందుగానే నారా లోకేష్ (nara lokesh) క్లారిటీ ఇచ్చేసారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడే అని బహిరంగంగా ప్రకటించేసారు. ముందే ప్రకటించేయడంతో ఓటర్లకు, జనసేన కార్యకర్తలకు సీఎం పదవి షేర్ చేసుకునే అవకాశమే లేదు అని క్లియర్‌గా చెప్పినట్లు అవుతుందని లోకేష్ అభిప్రాయపడినట్లు ఉన్నారు. (pawan kalyan)
ఇది ఎంత వరకు సమంజసం?
జనసేనాని పవన్ కేవలం రాజకీయ నేత కాదు. ఆయన ముందు సినిమాల్లో ఎదిగి పవర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుని ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాబట్టి అభిమానులకు ఆయనపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇష్టమైన నటుడు తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు? ఈ మాత్రం దానికే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు జనసైనికులపై చేయి చేసుకోవడం ఎంత వరకు సమంజసం? సరిగ్గా ఎన్నికల ముందు గొడవ ఎందుకులే అని పవన్ ఊరుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆయనకు ఒళ్లు మండిందంటే ఓడితే ఓడాం.. గెలిస్తే గెలిచాం అన్న సిద్ధాంతంతో ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగినా దిగుతారు. కాబట్టి తెలుగు దేశం కార్యకర్తలు పొత్తు విడిపోకుండా పొరపొచ్చాలు లేకుండా సవ్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది. మీరేమంటారు? (pawan kalyan)
ఇలాగైతే పొత్తు కుదురుతుందా?
పొత్తులో భాగంగా ఏ సీట్లలో పోటీ చేయబోతున్నామో ముందే ప్రకటించేయొద్దు.. ఇలా చేస్తే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందే జాగ్రత్త పడి తన సైడ్ నుంచి తెలుగు దేశం, జనసేన పార్టీలకు ఓట్లు పడకుండా చేస్తాడు అని పవన్.. చంద్రబాబుని ముందే హెచ్చరించారు. దీనికి ఒప్పుకున్నట్లే ఒప్పుకుని ఆ తర్వాత తాము మండపేటలో పోటీ చేసేస్తున్నామని చంద్రబాబు ప్రకటించేసారు. దాంతో పవన్‌కు ఒళ్లు మండింది. నాకేమన్నా తక్కువా అన్నట్లు పవన్ కూడా రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీ చేయబోతోంది అని ప్రకటించేసారు. అప్పటినుంచి తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య స్వల్ప విభేదాలు మొదలయ్యాయి. ప్రధాన నేతల కంటే ఇతర నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలాగైతే పొత్తు చిత్తు అవుతుందేమోనని ప్రతిపక్ష పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. (pawan kalyan)