Purandeswari: పొత్తులో ట్విస్ట్.. ఏం జ‌రిగింది?

Purandeswari: తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలతో పొత్తు పెట్టుకోవాల‌ని BJP ఏపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి కూడా ఎంతో గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. చివ‌ర‌కు పొత్తు స‌క్సెస్ అయింది. పురంధేశ్వ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి పోటీ చేస్తారు. అంతా స‌వ్యంగానే ఉంది. ఇంత‌లో ఉన్న‌ట్టుండి ఏం జరిగిందో ఏమో.. పురంధేశ్వ‌రి ఏదో విష‌యం అలిగిన‌ట్లు తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇంటికి భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత గ‌జేంద్ర సింగ్ శెఖావ‌త్ వెళ్లిన నేప‌థ్యంలో పురంధేశ్వ‌రి ఆయ‌న ఇంటికి వెళ్ల‌లేదు. నిజానికి BJP రాష్ట్ర అధ్య‌క్షురాలిగా ఆమెను శెఖావ‌త్‌తో పాటు వెళ్లాల్సిందిగా హైక‌మాండ్ ఆదేశించింది. అయినా కూడా పురంధేశ్వ‌రి వెళ్ల‌క‌పోవ‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకు పురంధేశ్వ‌రి రాలేదు అని అడిగినా కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు స‌రైన స‌మాధానం చెప్ప‌డంలేదు.