BRS: KCRకి బిగ్ షాక్‌.. వారంతా కాంగ్రెస్‌లోకి?

Hyderabad: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ప‌లువురు BRS ఎమ్మెల్యేలు KCRకు షాకిచ్చారు. దాదాపు 35 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో (congress) చేర‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ 35 మందికి స‌స్పెండ్ అయిన జూప‌ల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరంతా క‌లిసి నిన్న దిల్లీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ మ‌ల్లిఖార్జున్ ఖర్గే (mallikarjun kharge), రాహుల్ గాంధీని (rahul gandhi) క‌లిసారు. నిన్న BJPకి చెందిన ప‌లువురు నేత‌లు కూడా కాంగ్రెస్ హైక‌మాండ్‌ని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. పొంగులేటి, జూప‌ల్లితో పాటు మిగ‌తా 35 మంది ఎమ్మెల్యేలు జులై మొద‌టి వారంలో కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. ఖ‌మ్మంలో ఈ కార్య‌క్ర‌మం చోటుచేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గెలిచాక కాంగ్రెస్‌కి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ‌లోనూ త‌మ స‌త్తా చాటాల‌ని చూస్తోంది. దాంతో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని BRS నుంచి స‌స్పెండ్ అయిన జూప‌ల్లి, పొంగులేటిని త‌మ‌తో క‌లుపుకోవాల‌ని కాంగ్రెస్ ప్లాన్ వేసింది. వీరిని BJP కూడా త‌మ పార్టీలోకి లాక్కోవాల‌ని చూసింది కానీ…జూప‌ల్లికి రాజ‌కీయ శ‌త్రువైన డీకే అరుణ ఆల్రెడీ BJPలో ఎంపీగా ఉన్నారు. దాంతో ఆయ‌న BJPకి వెళ్లాల‌నుకోలేదు. BRSకి తెలంగాణ‌లో ఓటు శాతం 46.87 ఉండ‌గా.. కాంగ్రెస్‌కు 28.43 ఉంది.