Telangana Elections: కోటీశ్వరులు.. క్రిమినల్ కేసులు..!
Telangana Elections: తెలంగాణలోని దాదాపు 90% మంది ఎమ్మెల్యేల దగ్గర రూ.13 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అంతేకాదు.. వారిలో 60% మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఈ వివరాలను బయటపెట్టింది. 118 ఎమ్మెల్యేలలో 106 మంది కోటీశ్వరులేనని తెలిపింది. వీరిలో 72 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఈ కేసులన్నీ కూడా తెలంగాణలో చేపట్టిన ధర్నాలు, నిరసనల కారణంగా బనాయించినవేనని BRS పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. అయితే ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
క్రిమినల్ కేసులు
AIMIM- 7 నేతలపై కేసులు
కాంగ్రెస్ – 6 నేతలపై కేసులు
BJP – 2 నేతలపై కేసులు
ఇక ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమపై అటెంప్టివ్ మర్డర్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలపై మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులు నమోదై ఉన్నాయి. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఓ రేప్ కేసు నమోదై ఉంది. అధికార BRS పార్టీలోని 59 మంది ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులకు సంబంధించిన FIRలు నమోదై ఉన్నాయి. (telangana elections)
క్రిమినల్ కేసులు ఉన్న 72 మంది ఎమ్మెల్యేలలో 44 మందిపై మర్డర్, దాడి, కిడ్నాప్, రేప్ వంటి సీరియస్ కేసులు ఉన్నాయి. ఈ 44 మంది ఎమ్మెల్యేలలో 38 మంది BRS పార్టీకి చెందినవారు ఉండగా ముగ్గురు కాంగ్రెస్ నుంచి ఇద్దరు BJP నుంచి ఉన్నారు. ఇంకొకరు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఉన్నారు.
చదువు
ఇక ఎమ్మెల్యేల విద్యార్హతల విషయానికొస్తే 69 మంది గ్రాడ్యుయేట్లుగా ఉండగా 43 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా హోల్డర్లుగా ఉన్నారు. ఇక వయసు విషయానికొస్తే 58 శాతం మంది అభ్యర్ధులు 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నారు. 64 శాతం మంది 51 నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉన్నారు. ఇక మహిళా ఎమ్మెల్యేలు కేవలం ఆరుగురే ఉన్నారు.