Banglore: అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు..!
Banglore: కర్ణాటక ఎన్నికల (karnataka elections) సమయంలో అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి గెలిచేసిన కాంగ్రెస్‌కు ఇప్పుడు నిధులు లేక ఏం చేయాలో తెలీడంలేదు. దాంతో ఐటీ హబ్ అయిన బెంగళూరులో (banglore) 4 గంటల పాటు కరెంట్ తీసేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. బెంగళూరులో రోజుకు నాలుగు గంటల చొప్పున కోతలు విధిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో అనధికారంగా 6 గంటల పైనే కోతలు విధిస్తున్నారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏం చెప్తారో చూడాలి.