Prudhvi Raj: మ‌రి ప‌వ‌న్‌ను అవ‌మానించిన‌ప్పుడు?

Hyderabad: YSRCP నేత అంబ‌టి రాంబాబును (ambati rambabu) ఇమిటేట్ చేయ‌డానికి అత‌నేమీ ఆస్కార్ న‌టుడు కాద‌ని అన్నారు 30 ఇయ‌ర్స్ పృథ్వీ (prudhvi raj). ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్ట్ చేసిన బ్రో (bro) సినిమాలో పృథ్వీ శ్యాం బాబు అనే క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. అయితే ఆ క్యారెక్ట‌ర్‌ను అంబ‌టి రాంబాబు ఓ సంద‌ర్భంలో చేసిన డ్యాన్స్ వీడియోను దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసారు అని చాలా మంది అంటున్నారు. దీనిపై అంబ‌టి రాంబాబు స్పందించారు. “” నేను బ్రో సినిమా చూడలేదు. కాని నన్ను అవమానించారు అని విన్నాను. పవన్ కళ్యాణ్ నన్ను శత్రువుగా ఎన్నుకున్నాడు. ఇలాంటివి చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నాడు “” అని అన్నారు.

దీనికి పృథ్వీ కౌంట‌ర్ ఇచ్చారు. “” అంబటి రాంబాబు ఆస్కార్ నటుడు కాదు ఆయన్ని ఇమిటేట్ చేయడానికి. అవమానించాము అంటున్నాడు మరి మీరు పవన్ కళ్యాణ్‌ని (pawan kalyan) అవమానించినపుడు ఏమయ్యింది? మీకంత సీన్ లేదు “” అని కౌంట‌ర్ వేసారు.