BRS లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నార‌ని ఆల్రెడీ 20 మంది ఎమ్మెల్యేలు మ‌ళ్లీ బీఆర్ఎస్‌లోకి వ‌స్తాం అని అంటున్నార‌ని అన్నారు మాజీ తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR. ఓ కీలక సీనియర్ నేత త‌న‌ను సంప్రదించారని 104 మంది BRS ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారని, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను BJP వాళ్లు బతకనిస్తారా అని కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా BJP కథ నడుస్తుందని త‌న‌తో ఓ సీనియ‌ర్ నాయకుడు వాపోయిన‌ట్లు KCR తెలిపారు. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని త‌న‌ను సంప్రదించాడని, కానీ ఇప్పుడే వద్దని నేనే చెప్పానని పేర్కొన్నారు.

ALSO READ

KTR: త‌ప్పు రేవంత్ రెడ్డిది కాదు… మాదే!