New Parliament ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా 19 పార్టీలు
Delhi: ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనం (New Parliament) ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి (president) కాకుండా ప్రధానమంత్రి మోదీ (modi) పార్లమెంటు భవనాన్ని (new parliament) ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని… పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు (Opposition parties) ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో… కాంగ్రెస్ (congress), DMK, AAP, శివసేన (యూబీటీ), సమాజ్వాదీ పార్టీ (samajwadi), సీపీఐ (cpi), జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్ (tmc), జనతాదళ్ (యునైటెడ్), ఎన్సీపీ (ncp), సీపీఎం (cpm), ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి.