వ్యతిరేకంగా 100 ఇండిపెండెంట్ నామినేషన్లు.. కారణం ఏంటి?
Telangana Elections: KCR నియోజకవర్గం అయిన గజ్వేల్ (gajwel) నుంచి మూడు పార్టీల అభ్యర్ధుల నామినేషన్లతో పాటు దాదాపు వంద మంది ఒంటరిగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేసారు. గజ్వేల్‌లో మొత్తం 145 మంది 154 నామినేషన్లు వేసారు. వీరిలో కాంగ్రెస్, BJP, BRS పార్టీల వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా ఉన్నారు.
అయితే వారిలో కొందరు నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు కూడా. ఈ వంద మంది కూడా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్‌కి చెందినవారే. ఈ శంకర్ హిల్స్‌లోని ఫ్లాట్లు పడగొట్టి అక్కడ KCR ORR ప్లాన్ చేసారు. తమ ఫ్లాట్లకు సరైన పత్రాలు కూడా ఉన్నాయని.. ORR కట్టాలనుకున్నప్పుడు తమకు ముందస్తు నోటీసులు కానీ ప్రత్యామ్నాయాలు కానీ పరిహారం కానీ చెల్లించలేదని వారు వాపోతున్నారు.
వంద మందిలో కొందరు జగిత్యాలలోని ముత్యంపేటకు చెందిన చెరుకు రైతులు ఉన్నారు. వారు షుగర్‌కేన్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే 100 నామినేషన్లలో 30 మంది తెలంగాణ ఉద్యమం సమయంలో చనిపోయినవారి కుటుంబీకులు, నిరుద్యోగులు, ధరణి పోర్టల్ కారణంగా భూములు కోల్పోయినవారు ఉన్నారు. ఇంకొన్ని జిల్లాల్లో కొందరు BRS నేతలు రెబెల్స్‌గా మారి పోటీ చేస్తున్నవారిపై వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించారు.